Share News

శ్రీశైలంలో చిరుత హల్‌చల్‌

ABN , Publish Date - Oct 17 , 2025 | 01:13 AM

శ్రీశైలం డ్యాం వద్ద బుధవారం అర్ధరాత్రి చిరుత హల్‌చల్‌ చేసింది. డ్యాం వద్ద విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్‌ సిబ్బందికి చిరుత కనపించడంతో తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.

శ్రీశైలంలో చిరుత హల్‌చల్‌

శ్రీశైలం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం డ్యాం వద్ద బుధవారం అర్ధరాత్రి చిరుత హల్‌చల్‌ చేసింది. డ్యాం వద్ద విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్‌ సిబ్బందికి చిరుత కనపించడంతో తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం షరామామూలుగా ఉందని ఎస్పీఎఫ్‌ వర్గాలు తెలిపాయి. అర్ధరాత్రి నుంచి మూడు గంటల వరకు ఆ ప్రాంతంలో సంచరించినట్లు సిబ్బంది పేర్కొంది. డ్యాం పై నుంచి పోయి వ్యూపాయింట్‌ వద్దకు చేరుకొని అక్కడ కుక్కపై దాడి చేసినట్లు చెప్పారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినా లాభం లేదని వారు తెలిపారు. చిరుత సంచారంపై విధుల్లో ఉన్న ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు.

Updated Date - Oct 17 , 2025 | 01:13 AM