Share News

వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:17 AM

మునిసిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు 60 సంవత్సరాలు పూర్తయిన వారికి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు.

వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి
శానిటరీ ఇనస్పెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న సీఐటీయూ నాయకులు

ఎమ్మిగనూరు టౌన, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు 60 సంవత్సరాలు పూర్తయిన వారికి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం మాస్టర్‌ పాయింట్ల దగ్గర సీఐటీయూ మండల అధ్యక్షుడు గోవిందు, కార్యదర్శి రాముడులు మాట్లాడుతూ మునిసిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు 60 సంవత్సరాలు పూర్తయిన వారికి వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తూ గ్రాట్యూటీ, పెన్షన సౌకర్యం కల్పించాలని మాస్టర్‌ కేంద్రంలో సీఐటీయూ అధ్వర్యంలో ధర్నా నిర్వహించి ప్రభుత్వాన్ని కోరారు. కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చెస్తూ 62 ఏళ్ల సర్వీసును మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. కరోనా సమయంలో అనారోగ్య కారణాల వల్ల మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిం చాలని శానిటరీ ఇనస్పెక్టర్‌ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన నాగరాజు, ఇస్మాయిల్‌, సల్మాన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 12:17 AM