గొర్రెలకు వదిలేశారు
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:20 AM
చాగలమర్రి గ్రామంలోని పకృద్దీన్ అనే రైతు సన్నజాజిపూల తోటను గొర్రెలకు వదిలేశాడు. ఎకరం పొలంలో సన్నజాజి పూల తోటను సాగు చేశాడు.
చాగలమర్రి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): చాగలమర్రి గ్రామంలోని పకృద్దీన్ అనే రైతు సన్నజాజిపూల తోటను గొర్రెలకు వదిలేశాడు. ఎకరం పొలంలో సన్నజాజి పూల తోటను సాగు చేశాడు. వైరస్ వల్ల తోట దెబ్బతింది. రూ.50 వేలు ఖర్చు చేసి పురుగు మందులు వాడినా పూలు రాలేదు. మొక్కలు ఎర్రబారి దెబ్బతిన్నాయి. దీంతో ఆదివారం గొర్రెలకు వదిలేశారు. సుమారు రూ.లక్ష దాక పెట్టుబడి పెట్టానని, మరో పక్క ధరలు, తెగుళ్ల వల్ల నష్టపోయామని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఉద్యానశాఖ ద్వారా రాయితీ కల్పించి ఆదుకోవాలని రైతు కోరారు.