Share News

మీనాక్షినాయుడుతో అధినాయకుల భేటీ

ABN , Publish Date - May 11 , 2025 | 11:01 PM

ఆదోని మాజీ ఎమ్మెల్యే మీ నాక్షినాయుడుతో టీడీపీ అధినాయకులు భేటీ అయ్యారు.

మీనాక్షినాయుడుతో అధినాయకుల భేటీ
మీనాక్షి నాయుడుతో జిల్లా అధ్యక్షుడు

చర్చలు జరిపిన ఆదోని అబ్జర్వర్‌, జిల్లా అధ్యక్షుడు

కార్యాలయాల్లో పనులు కావడం లేదని ఆవేదన

టీడీపీ క్యాడర్‌లో నెలకొన్న నిరాశ, నిస్పృహలు

అందరికీ న్యాయం చేస్తామని హామీ

ఆదోని, మే 11 (ఆంధ్రజ్యోతి) : ఆదోని మాజీ ఎమ్మెల్యే మీ నాక్షినాయుడుతో టీడీపీ అధినాయకులు భేటీ అయ్యారు. ఈ భేటీ సర్వత్రా చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో చోటుచేసు కుంటున్న పరిణామాలపై చర్చలు జరిపేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఆదోనికి నూతనంగా ఎంపికైన అబ్జర్వర్‌ ధర్మవరం సుబ్బారెడ్డి ఆదివారం ఉదయం ఎనిమిదన్నర గంట లకు మీనాక్షినాయుడు ఇంటికి చేరుకున్నారు. అరగంట పాటు ప్రత్యేకగదిలో చర్చలు జరిపారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి వాహ నంలోని మీ నాక్షినాయుడు ఎమ్మిగనూరు వరకు వెళ్లినట్టు సమాచారం. ఇదిలా ఉండగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, ఇటీవల కలెక్టర్‌, ఎస్పీతో పాటు ఉన్నత అధికారులు నియోజకవర్గంలో ఏర్పడిన స్తబ్దత గురించి వివరించినా ఇప్పటివరకు ఎలాం టి పరిణా మాలు చోటుచేసుకోలేదు. ప్రభుత్వ కార్యాల యాల్లో టీడీపీకి నాయకులకు గట్టి ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. ఎక్కడా పనులు కావడంలేదని, తమను టీడీపీ వాళ్లగా చూడ టంలేదని నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా మాట్లాడుతు న్నారు. నియోజకవర్గంలో పూర్త్తిస్థాయిలో టీడీపీ క్యాడర్‌ ఉన్నా చిన్నపాటి పనులు కూడా చేయలేకపోయాననే బాధలో మీనాక్షినాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూటమి ఎమ్మెల్యే పార్థసారథి మాత్రం ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతూ 23 రోజుల్లోనే ఎమ్మెల్యే అయిన వ్యక్తికి ఆదోని నియోజకవర్గం గురించి ఏమి తెలుసునని టీడీపీ సీనియర్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

కార్యకర్తలకు స్వేచ్ఛ ఇవ్వాలి..

టీడీపీ అధిష్టానం చొరవ తీసుకుని నియోజకవర్గంలోని కార్యకర్తలకు పూర్తిస్థాయి స్వేచ్ఛని ఇవ్వాలంటున్నారు. ఇటీవల బీజేపీలో చేరిన వైసీపీ నాయకులకే పట్టం కట్టడమేంటంటూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ పరిపాలనలో ఐదేళ్ల పాటు కేసులు, దాడులతో ఇబ్బందులు పడ్డామని, మళ్లీ వాళ్లే బీజేపీ వచ్చి పెత్తనం చెలాయించడం ఎంతవరకు భావ్యమంటూ అధిష్టానానికి పలువురు ఫిర్యాదు చేశారు. జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, అబ్జర్వర్‌ ధర్మవరం సుబ్బారెడ్డి ఇదేవిషయంపై చర్చించినట్లు సమాచారం. తిక్కారెడ్డి మీనాక్షి నాయుడు ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్న కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఆదోని విషయంపై ప్రశ్నల వర్షం కురిపిం చినట్లు తెలిసింది. ఆదోని కార్యకర్తలను టీడీపీ అధిష్టానం నట్టేట ముంచుతోందని తమ ఆవేదనను వెళ్లగక్కారు. త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటామని, కార్యకర్తలకు అన్ని విధాల న్యాయచేస్తామని హామీఇచ్చి వెళ్లినట్లు తెలిసింది.

Updated Date - May 11 , 2025 | 11:01 PM