ప్రయాణం.. నరకం..
ABN , Publish Date - Jun 29 , 2025 | 11:46 PM
మండల కేంద్రానికి కర్నూలు నుంచి ఆర్టీసీ ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. సాయంత్రం 4 గంటలు దాటితే కర్నూలు నుంచి దేవనకొండకు బస్సులు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు నుంచి దేవనకొండకు బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు
దేవనకొండ, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి కర్నూలు నుంచి ఆర్టీసీ ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. సాయంత్రం 4 గంటలు దాటితే కర్నూలు నుంచి దేవనకొండకు బస్సులు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి వస్తే తిరిగి వెళ్లేది ఎప్పుడో? తెలియడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవనకొండ, పత్తికొండ, ఆలూరు ప్రాంతాల నుంచి రోజూ వేల సంఖ్యలో ప్రయాణికులు కర్నూలుకు వస్తారు. సాయంత్రం మూడు గంటల్లో పని పూర్తయితే తిరుగు ప్రయాణం సాఫీగా సాగుతుంది. సాయంత్రం నాలుగు గంటలు దాటిందా ఇక అంతే. ఆ సయంలో సరిపోయి నన్ని బస్సులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇక చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఉంటే అంతే. బస్సులో సీటు దక్కాలంటే పోరాటం చేయాల్సిందేనని వాపోతు న్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి కర్నూలు నంచి దేవనకొండ మీదుగా ఆలూరు, పత్తికొండకు మరిన్ని బస్సు లు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఎదురుచూడాల్సి వస్తోంది
సాయంత్రం నాలుగు దాటితే కర్నూలు బస్టాండులో పత్తికొండ బస్సుల కోసం ఎదురుచూడాలి. బస్సులు ప్రయాణికుల రద్దీకి సరిపోయినన్ని లేవు. బస్సు వచ్చే లోగా సీటు కోసం పరుగు తీయాల్సి న పరిస్థితి. కుటుంబంతో వస్తే సీటు దొరకదు. నిలు చునే ప్రయాణం చేయాలి. - బసవరాజు, ప్రయాణికుడు