లేబర్ కోడ్లను రద్దు చేయాలి
ABN , Publish Date - May 21 , 2025 | 12:27 AM
దేశవ్యాప్తంగా లేబర్ కోడ్లను రద్దుచేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి జే.లలితమ్మ డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాల నిరసన
కర్నూలు న్యూసిటీ, మే 20(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా లేబర్ కోడ్లను రద్దుచేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి జే.లలితమ్మ డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాల తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల అధ్వర్యంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి జి.చంద్రశేఖర్, సీఐటీయూ నగర కార్యదర్శి విజయ్ అధ్యక్షతన జిల్లా పరిషత నుంచి కలెక్టరేట్ వరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. లలితమ్మ మాట్లాడుతూ రైతుల పండించిన పంటలకు కనీస మద్దతు ధర చట్టం అమలు చేయాలని, ఉపాధి హమీ పథకానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్‌కోడ్లతో కార్మిక వర్గం కనీస వేత నం, ఉద్యోగుల భద్రత కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే.జగన్నాథం మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రధాని నరేం ద్ర మోదీ నల్ల చట్టాలను రద్దు చేస్తానని, స్వామినాథన సిఫారసులు అమలు చేస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఉపాధి కూలీలకు కూలి రూ.600 పెంచాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్య క్షుడు పీఎస్.రాధాక్రిష్ణ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్.మునెప్ప, వ్యవ సాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారా యణ, ఐఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు పి.సుంకన్న, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు సురేష్ నాయక్, ఏఐటీయూసీ నగర డిప్యూటీ కార్యదర్శి రామాంజనేయులు మహేష్, రమీజాబీ పాల్గొన్నారు.
ఓర్వకల్లు: ప్రభుత్వ రంగాల్లో పని చేసే కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగన్న కోరారు. మంగళవారం మండల కేంద్రమైన ఓర్వకల్లులో రైతు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమానికి రైతు సంఘం మండల నాయకులు మధుసూదన అధ్యక్షత వహించారు. ఈ సంద ర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగన్న, సీఐటీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు షాజహాన, శ్రీధర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నార న్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ ఉన్న ఉద్యోగాలనే ఊడగోడుతున్నారని ఆరోపించారు. తక్షణమే నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేసి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి కూలీలకు 200 రోజుల పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, మల్లేష్, చాం ద్‌బాషా, మహేష్, మాసూంబాషా, బషీర్, మురళి, ఎల్లరాజు, లక్ష్మీదేవి, శ్రీనివాసులు, అంగనవాడీ యూనియన నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
కోడుమూరు: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని సీఐటీయూ మండల కార్యదర్శి వీరన్న పిలుపు నిచ్చారు. స్థానిక కోట్ల సర్కిల్‌లో మంగళవారం సీఐటీయూ, ఏఐటీ యూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీరన్న మా ట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి హామీ పథకం నిధులు పెంచాలని, ఉపాధి కూలీలకు 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐటీ యూ, ఏఐటీ యూసీ నాయకులు మద్దిలేటి, లక్ష్మన్న, బుడ్డన్న, తాయప్ప, రాజు, రాము డు, మునిస్వామి పాల్గొన్నారు.
గూడూరు: లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ డివిజన కా ర్యదర్శి జే.మోహన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళ వా రం గూడూరు పట్టణంలో కేంద్ర కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సం ఘాల కమిటీల పిలుపు మేరకు గూడూరు పాత బస్టాండులో సీఐటీ యూ మండల అధ్యక్షుడు గుంటప్ప అధ్యక్షతన నిరసన తెలిపారు. సీఐ టీయూ డివిజన కార్యదర్శి జె.మోహన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా 44 రకాలు కార్మికుల చట్టాలను కుదించి వాటిని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఆర్‌పీల సంఘం అధ్యక్షురాలు ప్రభావతి, అంగన వాడీ, ఆశా వర్కర్స్ యూనియన నాయకులు, హమాలీ సంఘం నాయకులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.