‘యోగాంధ్ర’ ఏర్పాట్లలో జిల్లా నాయకులు
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:34 AM
విశాఖ కేంద్రంగా ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. యెగాంధ్ర-2025 కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. గిన్నీస్ బుక్ రికార్డు నమోదుచేసే లక్ష్యంగా ఈయోగా దినోత్సవం నిర్వహిం చనున్నారు.
ఒక్కో బృందానికి ఒక మంత్రికి ఇన్‌చార్జి బాధ్యతలు
కర్నూలు, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): విశాఖ కేంద్రంగా ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. యెగాంధ్ర-2025 కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. గిన్నీస్ బుక్ రికార్డు నమోదుచేసే లక్ష్యంగా ఈయోగా దినోత్సవం నిర్వహిం చనున్నారు. రాష్ట్ర నలమూల నుంచి లక్షలాది మంది యోగా సాధకులు విశాఖ చేరుకో నున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పలువురు టీడీపీ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఒక్కో బృందానికి ఒక మంత్రికి ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. జిల్లాకు చెందిన పరిశ్ర మలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ నాయకత్వంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కేడీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, ఏపీ కురవ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, ఏపీ శాలివాహన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు తుగ్గలి నాగేంద్ర యోగాంధ్ర ఏర్పాట్లు కోసం విశాఖ చేరుకున్నారు. వారికి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే యోగా సాధకులను క్రమపద్ధ్దతిలో యోగా ప్రాంగణం లోకి పంపించే బాధ్యతలు అప్పగించారు.