శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా కర్నూలు జేసీకి అదనపు బాధ్యతలు
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:36 PM
కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న నూరుల్ ఖమర్‌కు శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
నంద్యాల, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న నూరుల్ ఖమర్‌కు శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ముఖ్యమైన ప్రాజెక్టు కావడంతో కర్నూలు జేసీకి అదనపు బాధ్యతలను అప్ప గించారు. త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది.