Share News

జల క్రీడల హబ్‌గా కర్నూలు

ABN , Publish Date - Oct 04 , 2025 | 11:57 PM

రాష్ట్రంలో జిల్లా క్రీడలకు హబ్‌గా కర్నూలు నిలుస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్‌పాల్‌, జిల్లా క్రీడల అభివృద్ది అధికారి భూపతిరావు అన్నారు.

జల క్రీడల హబ్‌గా కర్నూలు
బోట్‌ నడుపుతున్న డీఈఓ

క్రీడా సంఘాల ప్రతినిధుల కృషి వెలకట్టలేనిది

డీఈవో శామ్యూల్‌పాల్‌

రాష్ట్రస్థాయి డ్రాగన్‌ బోట్‌ పోటీలు ప్రారంభం

కర్నూలు స్పోర్ట్స్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జిల్లా క్రీడలకు హబ్‌గా కర్నూలు నిలుస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్‌పాల్‌, జిల్లా క్రీడల అభివృద్ది అధికారి భూపతిరావు అన్నారు. శనివారం గార్గేయపురంలోని కర్నూలు సిటీ ఫారెస్టు చెరువు సమీపంలో రాష్ట్ర స్థాయి 4వ కయాకింగ్‌ అండ్‌ కెనోయింగ్‌ డ్రాగన్‌ బోట్‌ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన క్రీడలను అభివృద్ది చేసేందుకు జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడా సంఘాల ప్రతినిధులు చేస్తున్న కృషి వెలకట్టలేదన్నారు. జిల్లాకు జల క్రీడలను పరిచయం చేస్తున్న నిర్వాహకుల కృషి అభినం దనీయమన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నుంచి చేయూతనందిస్తామని అన్నారు. రాష్ట్ర యోగా సంఘం చైర్మన్‌ లక్ష్మికాంతరెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కర్నూలు సెంటర్‌ ఇన్‌చార్జి కార్తికేయన్‌, జిల్లా ఒలంపిక్‌ సంఘం సీఈవో విజయ్‌కుమార్‌, రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ సంఘం కోశాధికారి డా.రుద్రరెడ్డి, జిల్లా యోగా సంఘం ఉపాధ్యక్షుడు సాయికృష్ణతో కయాకింగ్‌ కేనోయింగ్‌ అసోసియేషన్‌ వ్యవస్థపకుడు శివారెడ్డి, డ్రాగన్‌ బోట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర సెక్రెటరీ మంచికంటి అవినాష్‌, జిల్లా వాటర్‌ స్పోర్ట్స్‌ కోచ్‌ చంద్రశేఖర్‌, స్కేటింగ్‌ సంఘం జిల్లా కార్యదర్శి సునీల్‌కుమార్‌, ఆర్చరి సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2025 | 11:57 PM