కుందూ వంతెన పునరుద్ధరణ
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:08 PM
నంద్యాల పట్టణ శివా రులో శిథిలావస్థకు చేరిన కుందూ నది పాత వంతెనను పునరు ద్ధరి స్తామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, నవంబరు 13 : నంద్యాల పట్టణ శివా రులో శిథిలావస్థకు చేరిన కుందూ నది పాత వంతెనను పునరు ద్ధరి స్తామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. గురువారం ఆమె ఈ వంతె నను జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఆర్డీవో విశ్వనాథ్, మున్సిపల్ కమిష నర్ శేషన్నలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగగా కలెక్టర్ మా ట్లాడుతూ.. పాత వంతెన శిథిలావస్థకు చేరుకున్న దృష్ట్యా ప్రభు త్వం ఇప్పటికే నూతన వంతెన నిర్మాణానికి భూసేకరణ నిధులు విడుదల చేసిందన్నారు. కొత్త వంతెన పూర్తవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని.. ఈలోగా రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పాత వంతెనను పునరుద్ధరిసాతమని అన్నారు. ఈ పనులు వారంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపా రు. ఈ వంతెనపై భారీ వాహనాలను అనుమతించమని అన్నారు.
‘వంద శాతం లక్ష్యంతో ఉపాధి పనులు’
నంద్యాల నూనెపల్లి, నవంబరు 13 : జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన అన్ని పనులను వంద శాతం లక్ష్యం సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి హామీ పనుల పురోగతిపై ఏపీవోలు, ఏపీడీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భండి కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని విభాగాల్లో ఉపాధి హామీ పనులు ముందంజలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో యావరేజ్ వేజ్ రేట్ పెరగడానికి హౌసింగ్, హార్టికల్చర్, సోక్‌పిట్స్ వంటి పనులను చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కొత్తపల్లి, బండి ఆత్మకూరు, ఆళ్లగడ్డ మండలాలు తక్కువ శాతం పురోగతి సాధించాయని తెలిపారు. ప్రతి మండలంలో కనీసం వెయ్యి కుటుంబాలకు వంద రోజులు ఉపాధి కల్పిస్తే జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమన్నారు. జిల్లాకు 59 వేల కంపోస్ట్ పిట్స్ లక్ష్యం కేటాయించగా ఇప్పటి వరకు కేవలం 5 వేలు మాత్రమే పూర్తయ్యాయన్నారు. హార్టికల్చర్ పనుల్లో కూడా కేటాయించిన లక్ష్యాలను సాధించేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.