Share News

పోతిరెడ్డిపాడును పరిశీలించిన కేఆర్‌ఎంబీ ఇన్‌చార్జి చైర్మన్‌

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:11 AM

కృష్ణానది యాజమాన్యబోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిలోకి వచ్చే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, బనకచర్ల క్రాస్‌ హెడ్‌రెగ్యులేటర్లను గురువారం బోర్డు ఇన్‌చార్జి చైర్మన్‌ పాండే, సభ్యులు కేకే జాన్‌గ్రిడ్‌ పరిశీలించారు.

పోతిరెడ్డిపాడును పరిశీలించిన కేఆర్‌ఎంబీ ఇన్‌చార్జి చైర్మన్‌
పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను పరిశీలిస్తున్న కేఆర్‌ఎంబీ ఇన్‌చార్జి చైర్మన్‌ పాండే, నీటిపారుదలశాఖ అధికారులు

జూపాడుబంగ్లా/ పాములపాడు, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కృష్ణానది యాజమాన్యబోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిలోకి వచ్చే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, బనకచర్ల క్రాస్‌ హెడ్‌రెగ్యులేటర్లను గురువారం బోర్డు ఇన్‌చార్జి చైర్మన్‌ పాండే, సభ్యులు కేకే జాన్‌గ్రిడ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నిర్మాణం, నీటిలభ్యతతో పాటు, జలాశయాల వివరాలను నీటిపారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లోనే వరదలు వచ్చాయని, గత 20ఏళ్లలో ఎన్నడూ ముందుగా వరదలు రాలేదని ఇన్‌చార్జి చైర్మన్‌కు అధికారులు వివరించారు. బనకచర్ల్ల క్రాస్‌ హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి నీటి మళ్లింపు, కాలువలు, జలాశయాలపై ఆరా తీశారు. వీరివెంట నీటిపారుదలశాఖ ఎస్‌ఈ ప్రతాప్‌, ఈఈ నాగేంద్రకుమార్‌, డీఈలు సుబ్రహ్మణ్యం రెడ్డి, నగేష్‌, రఘురామరెడ్డి, ఏఈలు విష్ణువర్ధన్‌రెడ్డి, దేవేంద్ర, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ ఏడీఈ పవన్‌, ఏఈ రాజశేఖర్‌ పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లతో ఎన్‌సీఎల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులో సమావేశం నిర్వహించి చర్చించారు. రాయలసీమ సాగునీటి సాధన కమిటీ అధ్యక్షులు బొజ్జదశరథరామిరెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు చేరుకుని కృష్ణానది జలాలను గతంలో మాదిరిగానే రాయలసీమకు నీటిని అందించాలని చైర్మన్‌ పాండేకు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Sep 05 , 2025 | 12:11 AM