Share News

నీతి, నిజాయితీకి మారుపేరు కోట్ల

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:54 AM

నీతి, నిజాయితీకి మారుపేరు మాజీ సీఎం కోట్ల విజయ భాస్కరరెడ్డి అని మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌ బాబు అన్నారు.

నీతి, నిజాయితీకి మారుపేరు కోట్ల
కాంగ్రెస్‌ కార్యాలయంలో కోట్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పిస్తున్న నాయకులు

మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌ బాబు

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మాజీ సీఎం జయంతి

కర్నూలు అర్బన్‌, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): నీతి, నిజాయితీకి మారుపేరు మాజీ సీఎం కోట్ల విజయ భాస్కరరెడ్డి అని మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌ బాబు అన్నారు. శనివారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం లో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో మాజీ డీసీసీ కె.బాబురావు, నాయ కులతో కలిసి కోట్ల విజయభాస్కరరెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. అంతక ముందు కోట్ల సర్కిల్‌లో కోట్లవిజయభాస్కర్‌రెడ్డి కాంస్య విగ్రహానికి, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నాయకులు, కార్యక ర్తలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఐఎన్‌ టీయూసీ జిల్లా అధ్యక్షులు బి. బ్రతుకన్న, ఎస్సీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బజారన్న, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు షేక్‌ ఖాజా హుస్సేన్‌, అమన్‌ , దామోదరం రాధాకృష్ణ, లాజరస్‌, సత్యరాజు పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 12:54 AM