చట్టాలపై అవగాహన అవసరం
ABN , Publish Date - Dec 22 , 2025 | 10:41 PM
నేటి పరిస్థితుల్లో చట్టాలపై అబ్బాయిలకు కూడా అవగాహన అవసరమని నంద్యాల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యా యాధికారి తంగమణి అభిప్రాయపడ్డారు.
ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయాధికారి తంగమణి
పాణ్యం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): నేటి పరిస్థితుల్లో చట్టాలపై అబ్బాయిలకు కూడా అవగాహన అవసరమని నంద్యాల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యా యాధికారి తంగమణి అభిప్రాయపడ్డారు. సోమవారం శాంతిరాం ఫార్మసీ కళాశాలలో మహిళా సాధికారక సమాఖ్య ఆధ్వర్యంలో జాతీయ లింగాధారిత హింస వ్యతిరేక ప్రచారంలో భాగంగా ‘నయీ చేతన 4.0’ కార్యక్రమం నిర్వహించారు. ఈసదస్సులో న్యాయాధికారి మాట్లాడుతూ నేటి ప్రపంచంలో చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తల్లిదండ్రులు అమ్మాయిలపై చూపించే భయం నేడు అబ్బాయిలపైన చూపించాల్సి ఉందన్నారు. బయటికి వెళ్లినపుడు తన కుమారుడు ఏఅమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించకూడదనే భయంతో ఉండాలన్నారు. మనదేశంలో చట్టాలపై ప్రజలకు అవగాహన తక్కువగా ఉందన్నారు. మహిళలపై దాడుల సమయంలో పోలీసులకు వెంటనే సమాచారం అందించేందుకు 100కు ఫోన్ చేయాలన్నారు. ప్రిన్సిపాల్ మధుసూదనచెట్టి, డైరెక్టర్ అశోక్‌కుమార్, మహిళా సాధికారక సమాఖ్య, ఎన్‌ఎ్‌సఎ్‌స కోఆర్డినేటర్లు మహేశ్వరి, ఎల్లాసుబ్బయ్య పాల్గొన్నారు.