Share News

రన్నర్స్‌గా కేఎంసీ ఫుట్‌బాల్‌ టీం

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:11 AM

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఆధ్వర్వర్యంలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో కర్నూలు మెడికల్‌ కాలేజీ టీమ్‌ రన్నర్స్‌గా నిలిచింది. 27వ మెడికల్‌, డెంటల్‌ అంతర్‌ కళాశాల పోటీల ఫైనల్‌లో కేఎంసీ 1-0 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది.

రన్నర్స్‌గా కేఎంసీ ఫుట్‌బాల్‌ టీం
పుట్‌బాల్‌ క్రీడాకారులతో ప్రిన్సిపాల్‌, స్పోర్ట్స్‌ కమిటీ

కర్నూలు హాస్పిటల్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఆధ్వర్వర్యంలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో కర్నూలు మెడికల్‌ కాలేజీ టీమ్‌ రన్నర్స్‌గా నిలిచింది. 27వ మెడికల్‌, డెంటల్‌ అంతర్‌ కళాశాల పోటీల ఫైనల్‌లో కేఎంసీ 1-0 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. కర్నూలుకు వచ్చిన క్రీడాకారులు గురువారం ప్రిన్సిపాల్‌ డా.కే.చిట్టినరసమ్మను కలిశారు. వైద్య విద్యార్థులు క్రీడల్లో రాణించడం పట్ల ప్రిన్సిపాల్‌ పీడీ రామకృష్ణ స్పోర్ట్స్‌ కమిటి వైస్‌ చైర్మన్‌ డా.విద్యాసాగర్‌ను అభినందించారు. మెడిసిన్‌ హెచ్‌వోడీ మెన్స్‌ కాలేజీ హాస్టల్‌ చీఫ్‌ వార్డెన్‌ డా.డి.శ్రీరాములు, సభ్యులు డా.విజయశంకర్‌, డా.సోమశేఖర్‌, డా.విజయ్‌బాబు, డా.ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 12:11 AM