Share News

క్రీడల్లో కేఎంసీ హవా

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:29 AM

డా.ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అంతర్‌ కళాశాలల పోటీల్లో కర్నూలు మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థులు సత్తా చాటారు. ఫైనల్‌లో సిద్దార్థ మెడికల్‌ కాలేజీ టీంపై గెలిచి విజేతగా, అలాగూ కబడ్డీలో మూడో స్థానంలో నిలిచారు.

క్రీడల్లో  కేఎంసీ హవా
ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపాల్‌ చిట్టి నరసమ్మ

బాల్‌ బ్యాడ్మింటన్‌లో రాష్ట్రస్థాయి విజేతలు..

కర్నూలు హాస్పిటల్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): డా.ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అంతర్‌ కళాశాలల పోటీల్లో కర్నూలు మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థులు సత్తా చాటారు. ఫైనల్‌లో సిద్దార్థ మెడికల్‌ కాలేజీ టీంపై గెలిచి విజేతగా, అలాగూ కబడ్డీలో మూడో స్థానంలో నిలిచారు. ఇటీవలే ఫుట్‌బాల్‌లో రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. కెప్టెన్‌ బి.మహీధర్‌ రెడ్డి, కబడ్డీ కెప్టెన్‌ సీహెచ్‌ దినేష్‌, స్పోర్ట్స్‌ కమిటీ చైర్మన్‌ డా.విద్యాసాగర్‌, డా.విజయ శంకర్‌, డా.విజయబాబు, డా.ప్రవీణ్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ రామకృష్ణను ప్రిన్సిపాల్‌ అభినందించారు.

Updated Date - Dec 23 , 2025 | 01:29 AM