Share News

కేఎంసీ క్యాంటీన మూసివేత

ABN , Publish Date - May 13 , 2025 | 12:15 AM

కర్నూలు మెడికల్‌ కాలేజీ ఆవరణలో ఉన్న క్యాంటీనను ఏపీజీడీఏ యూనియన నాయ కులు సోమవారం నోటీసు అతికించి మూసివేశారు.

కేఎంసీ క్యాంటీన మూసివేత
క్యాంటీనను మూసివేసిన యూనియన నాయకులు

కర్నూలు హాస్పిటల్‌, మే 12(ఆంధ్రజ్యోతి): కర్నూలు మెడికల్‌ కాలేజీ ఆవరణలో ఉన్న క్యాంటీనను ఏపీజీడీఏ యూనియన నాయ కులు సోమవారం నోటీసు అతికించి మూసివేశారు. ఏపీ గవర్న మెంటు డాక్టర్స్‌ అసో సియేషన (కేఎంసీ యూనిట్‌) అధ్యక్షుడు డాక్టర్‌ పి.బ్రహ్మాజీ మాస్టర్‌ మాట్లాడుతూ రోగులు, డాక్టర్లకు అల్పాహారం, భోజనం అందించే కర్నూలు మెడికల్‌ కాలేజీ క్యాంటీన మాదేనని అన్నారు. క్యాంటీన నిర్వాహకులకు ఇచ్చిన 5 రోజుల గడువు ముగి సిందని, వారికి ఎటువంటి హక్కులు ఉన్నా చర్చలకు రావాలన్నారు. ఏపీజీడీఏ బైలా ప్రకారం క్యాంటీన అసోసియేషనదేనని, కోర్టుకు వెళ్లాల్సింది వారు కాదని, అసోసియేషన వారు వెళ్లాలని తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు, ప్రిన్సిపాల్‌కు తెలియజేశామని, ఇచ్చిన గడువు ముగియడంతో మూసి వేశామన్నారు. ఇక నుంచి ఏపీజీడీఏ అసోసి యేషన క్యాంటీనను నిర్వహిస్తుందని, త్వరలో జనరల్‌ బాడీ సమా వేశం ఏర్పాటు చేసి క్యాంటీన నిర్వహణ అంశాన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏపీజీడీఏ కోశాధికారి డాక్టర్‌ డమం శ్రీనివాసులు, ఈసీ సభ్యులు డాక్టర్‌ రంగయ్య, డా.బాల సారయ్య, డా.సోమశేఖర్‌, ప్రొఫెసర్లు డాక్టర్లు నాగేశ్వరరావు, రమణ, పీజీలు పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2025 | 12:15 AM