Share News

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN , Publish Date - May 18 , 2025 | 12:53 AM

మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
మొక్క నాటి ప్రతిజ్ఞ చేస్తున్న మంత్రి ఫరూక్‌, అధికారులు

మొక్కల పెంపకంతో కాలుష్య నివారణ

న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల టౌన్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆత్మకూరు బస్టాండులోని ఫిల్టర్‌ పంపుహౌస్‌ ఏర్పాటుచేసి ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ స్వఛ్ఛఆంధ్ర అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు పెంపకంతో కాలుష్యాన్ని నివారించొచ్చు అని అన్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నా యని, వాటి నుంచి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ప్రతినెల మూడో శనివారం ఈకార్యక్రమం నిర్వహించడంతో ప్రజల్లో పరిశుభ్రతపై మరింత అవగాహన పెరుగుతుందన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు తీసుకుని వారికి కావా ల్సిన అందించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దీంతో నంద్యాలల్లో ఎక్కడ కూడా మురుగు నిల్వలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పురపాలక అధికారులకు సూచిం చారు. అనంతరం ఆయా ప్రాంతంలో మొక్కలు నాటి ప్రతిఙ్ఙ చేశారు. కార్యక్ర మంలో నంద్యాల మున్సిపల్‌ కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి, అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటదాస్‌, ఎంఈ గురప్ప యాదవ్‌, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 12:53 AM