Share News

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

ABN , Publish Date - May 16 , 2025 | 12:57 AM

ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దీంతో దోమల వ్యాప్తి జరగదని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ కామేశ్వరరావు అన్నారు.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
పోస్టర్‌ను విడుదల చేస్తున్న అధికారులు

జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ కామేశ్వరరావు

నంద్యాల హాస్పిటల్‌, మే 15(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దీంతో దోమల వ్యాప్తి జరగదని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ కామేశ్వరరావు అన్నారు. గురువారం జీజీహెచలోని ఎంసీహెచ బ్లాక్‌ సమావేశహాల్‌లో డెంగీ నివారణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ డెంగీను ఓడించడానికి మూడు పద్ధతులు పాటించాలన్నారు. పరిశీ లించడం, శుభ్రం చేయడం, మూతలు పెట్టడం వంటి మూడు పద్ధతు లు పాటిస్తే డెంగీను నివారించవచ్చని అన్నారు. ఆడ ఏడిస్‌ దోమకా టుతో డెంగీ వస్తుందని డీఎంహెచవో డాక్టర్‌ వెంకటరమణ అన్నారు. దోమలు కుట్టకుండా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాలు పరి శుభ్రంగా ఉంచుకుంటేనే వ్యాధుల బారినపడకుండా ఉంటారన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ మనోహర్‌ మాట్లాడుతూ కుళాయి పైపులు లీకేజీ లేకుండా తమ సిబ్బందితో పర్యవేక్షిస్తామన్నారు. మత్స్యశాఖ అధికారి రాఘవరెడ్డి మాట్లాడుతూ వర్షాకాలంలో గంబూషియా చేపలను సర ఫరా చేసేందుకు అన్నివిధాలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం జాతీయ డెంగీ నివారణ దినోత్సవ పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్ర మంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ సురేషనబాబు, డా.అంకిరెడ్డి, డా.కాంతారావునాయక్‌, డా.భరతకుమార్‌, డా.తేజస్విని, జిల్లా మలేరియా సహాయ అధికారి రామవిజయరెడ్డి, డా.ప్రసన్నలక్ష్మి, సబ్‌ యూనిట్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2025 | 12:57 AM