బస్టాండు పరిసరాలను శుభ్రంగా ఉంచండి: కలెక్టర్
ABN , Publish Date - May 23 , 2025 | 12:55 AM
ఆర్టీసీ బస్టాండు పరిసరా లను శుభ్రంగా ఉంచాలని కలెక్టర్ పి.రంజిత బాషా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ టి.శ్రీనివాసులును ఆదేశించారు.
కర్నూలు రూరల్, మే 22(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్టాండు పరిసరా లను శుభ్రంగా ఉంచాలని కలెక్టర్ పి.రంజిత బాషా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ టి.శ్రీనివాసులును ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కర్నూలు కొత్తబస్టాండును తనిఖీ చేశారు. మౌలిక సదుపా యాలను, పార్కింగ్‌లను కలెక్టర్ పరిశీలించారు. హోటల్స్‌కు వచ్చే ప్రయాణికులు వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసుకోకుం డా తగిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బస్టాండు ప్రాంతంలో పరిశుభ్రత పాటించడం లేదని ఆర్‌ఎంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్యం మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. చదువురాని ప్రయాణికుల కోసం వారు వెళ్లాల్సిన బస్సు ఏ ప్లాట్‌ఫాంలో ఉందని తెలియజేసే విధంగా ఒక మార్గదర్శకుని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. బస్టాండులో డ్రింకింగ్ వాటర్, కూల్‌డ్రింక్ షాపులలో ఉన్న వాటికి ఐఎస్‌ఐ మార్కు ఉందా లేదానే విషయాలను తనిఖీ చేయాలని కర్నూలు ఆర్డీవో, అర్బన తహసీల్దార్లను కలెక్టర్ ఆదే శించారు. బస్టాండు ప్రాంగణంలో అన్న క్యాంటీన ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన నోట్‌ను కర్నూలు మున్సిపల్ కమిషనర్‌కు ఇవ్వాలని ఆర్‌ఎంను ఆదేశించారు. బస్టాండు ఆవరణలో టాయిలెట్లు దుర్వాసన వెదజల్లుతుందని, బ్లీచింగ్ పౌడర్ చల్లించడంతోపాటు పినాస్థలిన బాల్స్ ఉంచాలని, ఇండియన వెస్ట్రన టాయిలెట్లు కొత్తవి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బస్టాండు ప్లాట్‌ఫాంలో పైకప్పు పెచ్చులు ఊడడం గమనించిన కలెక్టర్ వాటిని వెంటనే మరమ్మతులు చేయించాలని ఆర్టీసీ ఈఈని ఆదేశించారు. బస్టాండు పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన ఆర్టీసీ ఆర్‌ఎంపై అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఆర్టీసీ డిపో-1, 2 మేనేజర్లు ఉన్నారు.