నకిలీ మద్యంపై నిఘా పెట్టండి
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:56 PM
నకిలీ మద్యంపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఆదేశించారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి
కర్నూలు అర్బన్ , అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యంపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ వి. హనుమంతరావుతో కలిసి ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల సీఐలతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా మొలకలచెరువు నకిలీ మద్యం నేపథ్యంలో జిల్లాలో ముమ్మర తనిఖీలు చేయాలని అన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాత కేసుల్లో నిందితులను బైండోవర్లు చేసి, వారి ప్రస్తుత కార్యకలాపాలపై దృష్టి పెట్టాలన్నారు.
పొరుగు రాష్ట్రాల మద్యం జిల్లాలోకి ప్రవేశించ కుండా నిరంతరం దాడులు కొనసాగించాలని ఆదేశించారు. సారా తయారీని మానేసిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించాలన్నారు. ఈ సమీక్షలో సూపరింటెండెంట్లు మచ్చా సుధీర్ బాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు డి. రామకృష్ణారెడ్డి, రాజశేఖరగౌడ్ పాల్గొన్నారు.