Share News

ఆలయాల్లో ‘కార్తీక’ సందడి

ABN , Publish Date - Nov 11 , 2025 | 12:28 AM

కార్తీక మాసం మూడో సోమవారం పురస్కరించుకొని ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.

ఆలయాల్లో ‘కార్తీక’ సందడి
కొలిమిగుండ్ల శివాలయంలో దీపాలు వెలిగిస్తున్న మహిళలు

భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు

కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు

కొలిమిగుండ్ల, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం మూడో సోమవారం పురస్కరించుకొని ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. కొలిమిగుండ్ల లలితా సుందరేశ్వరస్వామి ఆలయంలో వేకువజాము నుంచి మహిళలు ఆలయానికి చేరుకొని కార్తీక దీపాన్ని వెలిగించారు. లొక్కిగుండం క్షేత్రం, నేలబిలం మల్లేశ్వరస్వామి, పెట్నికోట కాశీ విశ్వేశ్వ రస్వామి, గుండు మల్లేశ్వరస్వామి, బెలుం సిద్ధరామేశ్వరస్వామి ఆలయా లు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ఆలయాల్లో సామూహిక అభిషేకాలు, అర్చనలు చేశారు.

దిగువ అహోబిలంలో వన భోజనోత్సవం

ఆళ్లగడ్డ: మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్ర మైన దిగువ అహోబిలంలో కోనేరు సమీపం లోని లక్ష్మీవనంలో మూడో కార్తీక సోమవారం సంద ర్భంగా వన భోజనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూ దేవి అమ్మవార్లకు గ్రామోత్సవం, అభిషేకం పూజ లు నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాల్‌ స్వామి తెలిపారు. ఆహోబిలం క్షేత్రంలో సోమ వారం వనభోజన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు స్వాతి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. అళ్లగడ్డకు చెందిన వైద్యులు నరసింహారెడ్డి, శివమ్మ హాజరై పేదలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

సాయిబాబా ఆలయంలో ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్‌ చైర్మన పూజలు

డోన టౌన: స్థానిక షిరిడీ సాయిబాబా మందిరంలోని శివాలయంలో ఏపీ రాష్ట్ర సీడ్స్‌ డెవలపెమెంట్‌ కార్పొరేషన చైర్మన ధర్మవరం సుబ్బారెడ్డి, సతీమణి మన్నె మల్లేశ్వరమ్మ పూజలు చేసి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ పురోహితులు తీర్థప్రసాదాలు అంద జేశారు. అలాగే పట్టణంలోని పోలీస్‌ స్టేషన సమీపంలో ఉన్న సాంబ సదాశివాలయంలో భక్తులు పాల్గొని అన్నాభిషేకం చేశారు. ఈ పూజల్లో ఎంపీపీ రేగటి రాజశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డోన రూరల్‌: పట్టణంలోని సాంబశివాలయంలో కార్తీక సోమవారం పురస్కరించుకుని శివుడికి భక్తులు అన్నాభిషేకం నిర్వహించారు. ఆలయ పురోహితులు శేషావలి శర్మ ఆధ్వర్యంలో శివలింగానికి భక్తులు పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

చాగలమర్రి: చాగలమర్రి గ్రామంలోని రామలింగేశ్వర, భీమలింగేశ్వర, బుగ్గమల్లేశ్వర, భైరవీశ్వర ఆలయాల్లో కార్తీకమాసం సందర్భంగా సోమవారం ఓంకార నాధాలతో కార్తీకశోభ నిండుకుంది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆకాశదీపాన్ని వెలిగించి పూజలు చేశారు. మహిళలు దీపాలు వెలిగించారు. భైరవీశ్వర ఆలయంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. అదేవిధంగా చాగలమర్రిలోని పాత శివాలయంలో ఈశ్వరస్వామి అన్నాభిషేక అలంకారంలో కొలువు దీరారు. స్వామిజీ అభినవ శంకరానందస్వామి ఆధ్వర్యంలో ఈశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

దొర్నిపాడు: మండలంలోని ఆయా గ్రామాల్లో కార్తీక మూడో సోమవారం పురస్కరించుకొని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చాకరాజువేముల గ్రామంలోని వీరబ్రహ్మేంద్ర ఆలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యుడు విజయ్‌సింహచౌదరి ఆధ్వర్యంలో తరలివచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. భాగ్యనగరం లోని రామాలయం, దొర్నిపాడు శివాలయాల్లో భక్తులు దీపాలు వెలి గించారు. భక్తులకు పురోహితులు ప్రసాద్‌శర్మ, నాగేశ్వరయ్యలు తీర్థప్రసాదాలు అందజేశారు.

అవుకు: కార్తీక మూడో సోమవారం పురస్కరించుకుని మండలంలోని శివాలయాలు భక్తులతో సోమవారం కిటకి టలాడాయి. పట్టణంలోని కాశీవిశ్వనాథస్వామి, చెర్లోపల్లెలోని బుగ్గమ ల్లేశ్వస్వామి, శివవరంలోని శివాలయాల్లో అర్చకులు శివుడికి అభిషే కాలు నిర్వహించారు. ఆలయాల వద్ద మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు.

Updated Date - Nov 11 , 2025 | 12:28 AM