భక్తిశ్రద్ధలతో కార్తీక పూజలు
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:49 PM
ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయంలో కార్తీక రెండో సోమవారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి, బీసీ ఇందిరమ్మ దంప తులు పూజలు చేశారు.
యాగంటిలో పూజలు చేసిన మంత్రి బీసీ దంపతులు
బనగానపల్లె, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయంలో కార్తీక రెండో సోమవారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి, బీసీ ఇందిరమ్మ దంప తులు పూజలు చేశారు. తెల్లవారుఝామున యాగంటి క్షేత్రానికి చేరు కున్న మంత్రి బీసీ దంపతులకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ పాండు రంగారెడ్డి, యాగంటిపల్లె ఉపసర్పంచ మౌళీశ్వరరెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో కొలువైన ఉమామహేశ్వరస్వామికి మంత్రి బీసీ దంపతులు పూజలు చేశారు. అనంతరం మంత్రి బీసీ విలేకరులతో మాట్లాడుతూ కార్తీక మాసంలో ఉమామహేశ్వరస్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మంత్రి బీసీ దంపతులకు ఆలయ ఏసీ పాండురంగారెడ్డి, మౌళీశ్వరరెడ్డిలు తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన బత్తుల బాలిరెడ్డి, పాతపాడుసర్పంచ మహేశ్వరరెడ్డి, బత్తుల భాస్కర్‌రెడ్డి, ఆర్‌సీ నాగిరెడ్డి, బాలనాయుడు, నారాయణరెడ్డి, శ్రీరాము లు, భరతుడు, బత్తుల గోపాల్‌రెడ్డి, రామశేఖర్ పాల్గొన్నారు.
ఉయ్యాలవాడ: మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహించారు. మహిళలు కుందూ నదిలో దీపాలు వదిలి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మాయలూరు గ్రామం లోని శివాలయంలో గ్రామస్థులు అభిషేకాలు చేశారు. అర్చకుడు భాస్కరశర్మ భక్తులుకు తీర్థ ప్రసాదాలు అందించారు.
దొర్నిపాడు: మండలంలోని ఆయా గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భాగ్యనగరంలోని రామాలయం, దొర్నిపాడు శివాలయాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. భక్తులకు పురోహితులు ప్రసాద్‌శర్మ, నాగేశ్వరయ్య తీర్థప్రసాదాలు అందజేశారు.
ప్యాపిలి: పట్టణంలోని నీలకంఠేశ్వరస్వామి, ఈశ్వరస్వామి, భ్రమరాం భిక మల్లికార్జునస్వామి ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు.
చాగలమర్రి: చాగలమర్రి గ్రామంలోని కోదండ రామాలయంలో మహిళలు కార్తీక మాసం సందర్భంగా విష్ణుసహస్ర పారాయణం చేశా రు. శివపార్వతులకు పూజలు, అభిషేకాలు చేశారు. శివపార్వతుల పల్లకి ఉత్సవం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రుద్రవరం: మండలంలోని శివాలయాలు భక్తులతో కిట కిటలాడాయి. రుద్రవరంలోని భాస్కర నందీశ్వరాలయాన్ని విద్యుద్దీపాల తో అలకరించారు. శివుడికి బిల్వ పత్రాలు సమర్పించి అభిషేకం చేశారు. మహిళలు దీపాలు వెలిగించారు.