కార్తీక మాస పూజలు ప్రారంభం
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:01 AM
డోన పట్టణంలో కార్తీకమాస పూజలు బుధవారం ప్రారంభమయ్యాయి.
డోన టౌన, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): డోన పట్టణంలో కార్తీకమాస పూజలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు సాంబ శివాలయంలో శివునికి భక్తులు న్యాయవాది నాగభూషణం రెడ్డి, హను మంతరెడ్డి, కల్లె అనూరాధతోపాటు భక్తులు పూజలు చేశారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు.
చాగలమర్రి: చాగలమర్రి గ్రామంలోని రామలింగేశ్వర, భీమలింగేశ్వర ఆలయాల్లో బుధవారం కార్తీక మాస ఉత్సవాలను ప్రా రంభించారు. ఆలయాల్లో మహిళలు దీపా లు వెలిగించారు. శివపార్వతులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆకాశ దీపాన్ని అభినవ శంకరానంద స్వామిజీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
రుద్రవరం: రుద్రవరంలోని భాస్కర నందీశ్వరాలయంలో ఆలయ నిర్వాహకుడు ఏరువ క్రిష్ణమూర్తి ఆకాశ దీపాన్ని ప్రారంభించారు. కోటకొండ, యల్లావత్తుల, చిన్నకంబలూరు, పెద్దకంబలూరు, ఆలమూరు, మందలూరు, చందలూరు గ్రామాల్లోని శివాలయాల్లో పూజలు ప్రారంభించారు.
ప్యాపిలి: పట్టణంలోని ఈశ్వరస్మామి, నీలకంఠేశ్వరస్వామి, భ్రమరాంభిక మల్లికార్జునస్వామి ఆలయాల్లో బుధవారం మహిళలు పూజలు చేశారు. స్వామివారికి జలాభిషేకాలు నిర్వహించారు. అలాగే మహిళలు ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించారు.