Share News

22 నుంచి కార్తీక మాసోత్సవాలు

ABN , Publish Date - Oct 18 , 2025 | 11:37 PM

మహానంది క్షేత్రంలో ఈనెల 22 నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

22 నుంచి కార్తీక మాసోత్సవాలు
మాట్లాడుతున్న ఈవో శ్రీనివాసరెడ్డి

భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు

ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి

మహానంది, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో ఈనెల 22 నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈవో మాట్లాడుతూ కార్తీక మాసంలో క్షేత్రాన్ని దర్శించుకోలేని భక్తుల కోసం పరోక్ష సేవలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ.2 వేలు దేవస్థానం అకౌంట్‌కు చెల్లిస్తే వారి పేరు, గోత్రాల మీద ప్రధాన గర్భాలయంలో అభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్తీక మాసం ముగిశాక దాతల అడ్ర్‌సకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు పోస్టు ద్వారా పంపుతామన్నారు. కార్తీక మాసంలో రద్దీకి అనుగుణంగా భక్తులకు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు. భక్తులకు క్యూలైన్లలో పాలు, బిస్కెట్లు అందజేస్తామని చెప్పారు. కార్తీక నాలుగు సోమవారాల్లో జలహారతి ఇస్తామని తెలిపారు. భక్తుల వాహనాల పార్కింగ్‌ కోసం రెండు ప్రదేశాల్లో లైటింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఆది, సోమవారాల్లో గర్భాలయంలో అభిషేకాలు రద్దు చేసి భక్తులకు సామూహిక అభిషేకాలకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా దేవస్థానం కార్యాలయం సమీపంలోని పోచా విశ్రాంతి భవనాన్ని ఉచితంగా కేటాయిస్తామని ఈవో తెలిపారు. నవంబరు 18న ఆలయంలో లక్ష బిల్వార్చన, 19న కామేశ్వరీదేవికి లక్ష కుంకుమార్చన, శాంతి కల్యాణాన్ని దాతలతో నిర్వహిస్తామన్నారు. ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా అదనపు సిబ్బందిని నియమించి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏఈవో మధు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగమల్లయ్య పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 11:37 PM