కర్ణాటక మద్యం స్వాధీనం
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:32 PM
మండలం లోని మాధవరం చెక్‌పోస్టు వద్ద గుల్బార్గాకు చెందిన నరసింహ అనే వ్యక్తి కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తెస్తుండగా మాధవరం చెక్‌పోస్టు సీఐ ప్రసాద్ రావు, ఎమ్మిగనూరు ఎక్సైజ్ సీఐ మొహిద్దీన బాషా దాడులుచేసి పట్టుకు న్నారు.
వ్యక్తి అరెస్టు, బైక్ సీజ్
మంత్రాలయం, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): మండలం లోని మాధవరం చెక్‌పోస్టు వద్ద గుల్బార్గాకు చెందిన నరసింహ అనే వ్యక్తి కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తెస్తుండగా మాధవరం చెక్‌పోస్టు సీఐ ప్రసాద్ రావు, ఎమ్మిగనూరు ఎక్సైజ్ సీఐ మొహిద్దీన బాషా దాడులుచేసి పట్టుకు న్నారు. మంగళ వారం రాత్రి మాధవరం చెక్‌పోస్టు వద్ద మోటార్ సైకిల్‌పై ఒక బాక్సులోని 192 కర్ణాటక 90 ఎంఎల్ మద్యం టెట్రా ప్యాకెట్లును స్వాధీనం చేసుకొని, బైక్‌ను సీజ్ చేసి వ్యక్తిని అరెస్టుచేశారు. నిందితుడిని ఎమ్మిగనూరు కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.