కర్ణాటక మద్యం ధ్వంసం
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:18 AM
కోసిగి ఎక్సైజ్ స్టేషన, కోసిగి, కౌతాళం పోలీస్ స్టేషన్లకు సంబంధించిన మొత్తం 105 కేసుల్లోని 2,442 లీటర్ల కర్ణాటక మద్యంను బుధవారం కోసిగి మార్కెట్ యార్డులో ట్రాక్టరు ద్వారా తొక్కించి ధ్వంసం చేశారు.

కోసిగి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): కోసిగి ఎక్సైజ్ స్టేషన, కోసిగి, కౌతాళం పోలీస్ స్టేషన్లకు సంబంధించిన మొత్తం 105 కేసుల్లోని 2,442 లీటర్ల కర్ణాటక మద్యంను బుధవారం కోసిగి మార్కెట్ యార్డులో ట్రాక్టరు ద్వారా తొక్కించి ధ్వంసం చేశారు. ఎక్సైజ్ సీఐ భార్గవరెడ్డి, ఎస్‌ఐ కార్తిక్‌సాగర్, కోసిగి ఎస్‌ఐ చంద్రమోహన ఆధ్వ ర్యంలో సుమారు రూ.12,27,600 విలువ గల సీజ్ అయిన కర్ణాటక మద్యం ధ్వంసం చేశామన్నారు.