తానా చేయూతతో కప్పట్రాళ్ల విద్యార్థినికి ర్యాంకు
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:05 AM
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ల గ్రామ అభివృద్ధికి, మహిళల స్వయం ఉపాధికి, విద్యార్థుల చదువుకు సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం
దేవనకొండ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ల గ్రామ అభివృద్ధికి, మహిళల స్వయం ఉపాధికి, విద్యార్థుల చదువుకు సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన మైమూన్ ఇంటర్మీడియెట్ విద్యాభ్యాసానికి ఆయన రూ.1.75 లక్షల సహాయం అందించి ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీలో చదివించారు. రవి ప్రోత్సాహంతో ఆమె నేడు ఇంటర్మీడియెట్‌లో ప్రతిభ చాటడంతో పాటు ఏపీ ఈఏపీ సెట్‌లో 6,947 ర్యాంక్ సాధించి వెటర్నరీ కాలేజీలో స్థానం సాధించింది. దీంతో మైమున్‌ను శనివారం కర్నూలులో జరిగిన కార్యక్రమంలో రవి అభినందించారు. మైమూన్ మాట్లాడుతూ రవి సహాయం మరువలేనిద న్నారు. కార్యక్రమంలో జగదీష్ రెడ్డి అనుముల, టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్, ముప్పా రాజశేకర్, ఏవో అక్బర్ బాషా తదితరులు పాల్గొన్నారు.