Share News

కబడ్డీ విజేత కాకినాడ..

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:35 PM

72వ ఆంద్రప్రదేశ్‌ పురుషుల కబడ్డీ విజేతగా కాకినాడ జట్టు టైటిల్‌ కైవసం చేసుకుంది. ఆదివారం రాత్రి పంచలింగాల ఏబీఎం చర్చి మైదానంలో నిర్వహించిన ఫైనల్‌ మ్యాచ్‌లో కాకినాడ జట్టు పశ్చిమ గోదావరి జట్టుపై 52-33 పాయింట్లతో నెగ్గింది. మూడో స్థానంలో పల్నాడు, బాపట్ల జట్లు నిలిచాయి.

కబడ్డీ విజేత కాకినాడ..
ట్రోఫీ అందజేస్తున్న నిర్వాహకులు

పంచలింగాలలో ముగిసిన రాష్ట్ర స్థాయి పోటీలు

కర్నూలు స్పోర్ట్స్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): 72వ ఆంద్రప్రదేశ్‌ పురుషుల కబడ్డీ విజేతగా కాకినాడ జట్టు టైటిల్‌ కైవసం చేసుకుంది. ఆదివారం రాత్రి పంచలింగాల ఏబీఎం చర్చి మైదానంలో నిర్వహించిన ఫైనల్‌ మ్యాచ్‌లో కాకినాడ జట్టు పశ్చిమ గోదావరి జట్టుపై 52-33 పాయింట్లతో నెగ్గింది. మూడో స్థానంలో పల్నాడు, బాపట్ల జట్లు నిలిచాయి. అంతకుముందు ఒకటో సెమీ ఫైనల్‌లో కాకినాడ పల్నాడుపై 38-28 పాయింట్లు, 2వ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో పశ్చిమ గోదావరి, బాపట్లపై 48-46 పాయింట్లతో నెగ్గింది. క్రిస్మస్‌ సందర్బంగా ఏబీఎం చర్చి పెద్దల ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు జరిగాయి. విజేతలకు ఏఎస్‌పీ హుశేన్‌పీరా, కబడ్డీ సంఘం కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్‌, బొందిలి వెల్ఫేర్‌ చైర్మన్‌ విక్రమ్‌సింగ్‌, గ్రామ సర్పంచ్‌ హాజరై విజేతలకు కప్‌ అందజేశారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశ్‌, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే దస్తగిరి గ్రామ పెద్దలు, ఏబీఎం చర్చి పెద్దలు బోజనం కల్పించి మాంటిస్సోరి పాఠశాల అధినేత రవిప్రకాష్‌కు నిర్వహకులకు రాష్ట్ర కార్యదర్శి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Dec 28 , 2025 | 11:35 PM