జ్యోతిబా పూలే జయంతి
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:19 AM
జ్యోతిబా పూలే 198వ జయంతిని శుక్రవారం పట్టణంలోని బీసీ ఫెడరేషన్, ఎమ్మార్పీఎస్ నాయకులు వేరువేరుగా నిర్వహించారు. బీసీ పెడరేషన్ కార్యాల యంలో ఉపాధ్యక్షుడు దస్తగిరి నాయుడు జిల్లా గౌరవాధ్యక్షుడు సాయి బాబా నివాళి అర్పించారు.

నివాళి అర్పించిన నాయకులు, అధికారులు, విద్యార్థులు
ఆదోని అగ్రికల్చర్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): జ్యోతిబా పూలే 198వ జయంతిని శుక్రవారం పట్టణంలోని బీసీ ఫెడరేషన్, ఎమ్మార్పీఎస్ నాయకులు వేరువేరుగా నిర్వహించారు. బీసీ పెడరేషన్ కార్యాల యంలో ఉపాధ్యక్షుడు దస్తగిరి నాయుడు జిల్లా గౌరవాధ్యక్షుడు సాయి బాబా నివాళి అర్పించారు. కత్తి హనుమంతరావు, దేవి శెట్టి ప్రకాష్, రాజేశ్వరరావు, వీరేష్, వడ్డే శ్రీనివాసులు, మల్లేశ్వరప్ప, దీపక్, తాయప్ప అమర్నాథ్ పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు తిమ్మన్న, హుస్సేనప్ప, బాలన్న, మాదాసు జగన్, గుమ్మల బాలస్వామి, గణేష్ పాల్గొన్నారు.
జ్యోతిబా పూలేకు ఘననివాళి
పత్తికొండ, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): జ్యోతిబా పూలే జయంతిని పత్తికొండ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు చల్లారవి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే పత్తికొండ ఏపీడీ కార్యాలయంలో సిబ్బంది నివాళి అర్పించారు.
ఘనంగా జ్యోతిబా పూలే జయంతి
పత్తికొండ టౌన్. ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బాలుర పాఠశాలలో బీసీ సంక్షేమ సంఘం అధ్వర్యంలో నివాళి అర్పిలంచారు. హెచ్‌ఎం మాలతి, బీసీ సంఘం నాయకులు శ్రీనివాసులు, దండి మల్లిర్జున, పీఈటీ రాజేష్, రామాంజినేయులు, పాల్గొన్నారు.
జ్యోతిబా పూలే జయంతి
ఆదోని టౌన్: బీసీ సంఘం సభ్యులు పనిర్వహించారు.ఎండీ బసవరాజ స్వామి, సాకరే మల్లేశ్వర రావు, గోవింద రావు, జిఆంజనేయులు, గుడికల్ కుమార స్వామి, మురళీధర్ గౌడ్, జామిర్, మల్లేష్ పాల్గొన్నారు.
ఘనంగా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు
ఆదోని రూరల్: పూలే జయంతిని మండల కార్యాలయంలో నిర్వహించారు. మాజీ ఎంపీపీ బడాయి పంపాపతి, సీనియర్ అసిస్టెంట్ వీరభద్రయ్య పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. సిబ్బంది వైశాలి, అబీ, యువరాజ్, తదితరులు పాల్గొన్నారు.