రహదారి విస్తరణలో బాధితులకు పూర్తి న్యాయం
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:00 AM
నగరంలో చేస్తున్న రహదారి విస్తరణ పనుల్లో భూమి, భవనాలు కోల్పోయే బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని నగర పాలక కమిషనర్ పి. విశ్వనాథ్ పేర్కొన్నారు.
కమిషనర్ పి. విశ్వనాథ్
కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): నగరంలో చేస్తున్న రహదారి విస్తరణ పనుల్లో భూమి, భవనాలు కోల్పోయే బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని నగర పాలక కమిషనర్ పి. విశ్వనాథ్ పేర్కొన్నారు. కిడ్స్ వరల్డ్ నుంచి బుధవారపేట వరకు(ఆర్‌టీపీ-2), చెక్‌పోస్టు నుంచి ఎస్‌ఎస్ గార్డెన్స్ వరకు రహదారి విస్తరణ పురోరగతిపై మంగళవారం కార్యాలయంలో పట్టణ ప్రణాళిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. విస్తరణ పనుల కోసం అవసరమైన ప్రకియలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. బాధితులకు ట్రాఫిక్ నియంత్రకణ, రహదారుల విస్తరణ ఆవశ్యకతను వివరించి, యాజమాన్య పత్రాలను తీసుకోవాలని ఆదేశించారు. కిడ్స్ వరల్డ్ నుంచి బుధవారపేట వంతెన వరకు రహదారి విస్తరణలో ప్రకభావితమవుతున్న 82 ఆస్తుల యజమానులతో మాట్లాడి, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. అలాగే ఎన్‌హెచ్ 340సీ రహదారి విస్తరణకు సంబంధించిన 201 ప్రభావిత ఆస్తుల యజమానులతో సమగ్రగంగా చర్చించి సందేహలను నివృత్తి చేయాలని, సమస్యలు ఉంటే తన దృస్టికి తీసుకురావాలని సూచించారు. నగరాభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఇంచార్జి సీపీ వెంకటరమణ, టీపీవో అంజాద్‌బాషా, బిల్డింగ ఇన్స్‌పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.