బాధితులకు న్యాయం చేయాలి: ఎస్పీ
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:21 AM
జిల్లా పోలీస్ కార్యా లయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే సమ స్యలను న్యాయబద్ధంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా సిబ్బందిని ఆదేశించారు.
నంద్యాల రూరల్, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీస్ కార్యా లయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే సమ స్యలను న్యాయబద్ధంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా సిబ్బందిని ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు 97 ఫిర్యాదులు అందజేశారు. ముఖ్యంగా నందమూరినగర్‌కు చెందిన రాముడు, ఆళ్లగడ్డకు చెందిన రామోజీరావు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదు చేశారు. భూములకు సంబంధించిన సమస్యల గురించి ఎస్పీకి ఏకరువు పెట్టారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులపై పూర్తి స్థాయిలో విచారించి సంతృప్తికరమైన పరిష్కారం చూపుతామన్నారు. చట్టపరిధి లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశిం చారు. ఫిర్యాదులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.