Share News

భయపెడుతున్న జూన్‌

ABN , Publish Date - Jun 05 , 2025 | 12:11 AM

ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో దడ మొదలైంది. ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, బ్యాగులు ఇతర సామగ్రి కొనాలంటే తల్లిదండ్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పాఠశాలలపై నియంత్రణ లేకపోవడంతో ఫీజుల భారం పెరిగింది.

భయపెడుతున్న జూన్‌

విద్యార్థుల తల్లిదండ్రులపై మోయలేని భారం

ప్రైవేటు పాఠశాలల దోపిడీ..

పెరిగిన ఫీజులు, పుస్తకాల ధరలు

ఆదోని, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో దడ మొదలైంది. ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, బ్యాగులు ఇతర సామగ్రి కొనాలంటే తల్లిదండ్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పాఠశాలలపై నియంత్రణ లేకపోవడంతో ఫీజుల భారం పెరిగింది.

ఏడాది సంపాదనంతా బడికే..

ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించాలంటే పేద, మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు ఏడాది సంపాదనంతే ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం స్కూలు ఫీజులు పెచుతున్నారని వాపోతున్నారు.

పుస్తకాలు, యూనిఫాం, బస్సు ఫీజులు..

ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు సాధారణ ఫీజుతో పాటు డొనేషన్లు, బస్సు చార్జీలు, యూని ఫాం, పుస్తకాల రూపంలో విద్యార్థుల తల్లిదం డ్రులపై అదనపు భారం మోపుతోంది. ఇవన్నీ తమ పాఠశాలలోనే కొనాలన్న నిబంధన విధి స్తుండటతో తల్లిదండ్రులు విధిలేని పరిస్థితుల్లో అదనంగా రూ.10వేల వరకు చెల్లిస్తున్నారు.

కుటుంబంపై రూ.లక్షల్లో భారం

కుంటుంబలో ఇద్దరు విద్యార్థులుంటే అంతే. దాదాపు రూ.లక్ష వరకు భారం పడుతోంది. కేవలం పిల్లల స్కూలు ఫీజులకే ఒక్కొక్కరికి రూ.50 వేలకు పైగానే ఖర్చు చేయాల్సి వస్తుందోని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనపడుతున్నారు.. ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్‌ చేర్పిందుకు రూ.లక్ష నుంచి రూ.1.5లక్షల వరకు అవుతోంది. ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలపై నియంత్రణ విధించాలని కోరుతున్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:11 AM