యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:10 PM
నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జేసీ విష్ణుచరణ్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
నంద్యాల ఎడ్యుకేషన్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జేసీ విష్ణుచరణ్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో బుధవారం జేసీ విష్ణుచరణ్ స్కిల్ డెవలప్‌మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నిరు ద్యోగ యువతీయువకులకు ఆసక్తి కల్గిన రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి కల్పించే దిశగా కోర్సులను గుర్తించాలన్నారు. జిల్లాలోని పెద్ద పరిశ్రమలను సంప్రదించి వాటిలో ఉద్యోగావకాశాలు కల్పించేవిధంగా యువతకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. జిల్లాకు కేటాయించిన టార్గెట్‌లను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.