8న జాబ్ మేళా
ABN , Publish Date - Dec 02 , 2025 | 01:13 AM
కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిసెంబరు 8న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సిరి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నైపుణ్యం అభివద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో పోస్టర్లను జేసీ నూరుల్ కమర్‌తో కలిసి ఆవిష్కరించారు.
కర్నూలు కలెక్టరేట్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిసెంబరు 8న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సిరి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నైపుణ్యం అభివద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో పోస్టర్లను జేసీ నూరుల్ కమర్‌తో కలిసి ఆవిష్కరించారు. జాబ్ మేళాలో 19 ప్రైవేటు కంపెనీల్లో 1,350 ఖాళీలను భర్తీ చేస్తారన్నారు. 18 నుంచి 35 సంవత్సరాలలోపు పదో తరగతి, ఇంటర్ డిగ్రీ, ఐటీఐ డిప్లమా బి.టెక్ పీజీ పూర్తిచేసిన వారు పాల్గొలన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్ మేళా ఉంటుందన్నారు. .ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌లింక్‌లో వివరాలు నమోదు చేసి చేసుకోవాలని, సందేహాలు ఉంటే 8374231357, 6300009183 నెంబర్లలో సంప్రదించాలన్నారు. ఉపాది కల్పన అధికారి దీప్తి, నైపుణ్య అభివృద్ది శిక్షణా అధికారి ఆనంద్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.