Share News

జీవో నెంబర్‌ 20ని సవరించాలి

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:57 AM

పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబరు 20ని సవరించాలని కర్నూలు లైసెన్సడ్‌ ఇంజనీర్స్‌ అసోసి యేషన (కేఎల్‌ఈఏ) అధ్యక్షుడు చిన్నప్రసన్న అన్నారు.

జీవో నెంబర్‌ 20ని సవరించాలి
మాట్లాడుతున్న చిన్న ప్రసన్న

కేఎల్‌ఈఏ అధ్యక్షుడు చిన్న ప్రసన్న

కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబరు 20ని సవరించాలని కర్నూలు లైసెన్సడ్‌ ఇంజనీర్స్‌ అసోసి యేషన (కేఎల్‌ఈఏ) అధ్యక్షుడు చిన్నప్రసన్న అన్నారు. ఆదివా రం స్కందా భవనంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ యజమాని ఉల్లంఘనలకు వెంటనే నివేదించక పోతే ఎల్‌టీపీని బాధ్యుడిగా భావించడం సరికాదన్నారు. ఎల్‌టీపీలకు నిర్మాణ నియమాలు పరిశీలించడానికి, తనిఖీలు చేయడానికి బాధ్యత ఇచ్చారు అయితే ఉల్లంఘనలు ఆపాడానికి అమలు చేయడానికి ఎందుకు అధికారాలు ఇవ్వలేదన్నారు. ఎల్‌టీపీ తప్పు చేస్తే 5 సంవత్స రాలు పాటు లైసెన్స రద్దు చేయడం అన్యాయ మన్నారు. ప్లింత లెవెల్‌ తనిఖీ నివేదిక 7 రోజుల్లో సమర్పించకపోతే అది ఆటోమెటిక్‌ సర్టిఫికే షనగా పరిగణించడబడుతుందని, దీని వల్ల ఎల్‌టీపీలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వం మరోసారి పునరాలోచించి జీవో 20ని సవరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈసమావేశంలో సభ్యులు కామేష్‌ గౌడు, రఫీయుద్దీన, షేక్‌ ముస్తాక్‌, ఏజాస్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 12:57 AM