జీవో 23ని రద్దు చేయాలి
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:39 AM
టూరిజం సంస్థను ప్రైవేటు పరం చేయడం సరికాదని, తక్షణమే జీవో నెంబరు 23ను రద్దు చేయాలని టూరిజం మేనేజర్ సువర్ణ కుమారి అన్నారు.
ఓర్వకల్లు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): టూరిజం సంస్థను ప్రైవేటు పరం చేయడం సరికాదని, తక్షణమే జీవో నెంబరు 23ను రద్దు చేయాలని టూరిజం మేనేజర్ సువర్ణ కుమారి అన్నారు. సోమవారం ఓర్వకల్లు గ్రామ సమీపంలోని రాక్ గార్డెన ఎదురుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు రెండున్నర శతాబ్దాల నుంచి సంస్థను నమ్ముకుని పని చేస్తున్నా మన్నారు. ఉద్యోగ భద్రత, సరైన జీతభత్యాలు లేకపోయినా ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నామన్నారు. జీవో 23ను ప్రభుత్వం తెచ్చి ప్రైవేటు సంస్థకు ఉపయోగించేలా నిర్ణయం తీసుకోవడం బాధాకర మన్నారు. కార్యక్రమంలో నాగరాజు, కార్తీక్, బోస్, చంద్రశేఖర్, బసప్ప, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.