యేసు త్యాగాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:16 AM
యేసు క్రీస్తు త్యాగాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని నంద్యాల డయాసిస్ పాదర్లు రెవరెండ్ పాల్‌రాజరావు, రెవరెండ్ నందంఐజక్ పేర్కొన్నారు.
పాదర్లు రెవరెండ్ పాల్‌రాజరావు, నందంఐజక్
గుడ్‌ప్రైడే సందర్భంగా క్రీస్తు సందేశం
నంద్యాల కల్చరల్, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): యేసు క్రీస్తు త్యాగాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని నంద్యాల డయాసిస్ పాదర్లు రెవరెండ్ పాల్‌రాజరావు, రెవరెండ్ నందంఐజక్ పేర్కొన్నారు. నంద్యాల హోలీక్రాస్ కెధడ్రిల్ చర్చిలో శుక్రవారం గుడ్‌ప్రైడే సందర్బంగా ఏసుక్రీస్తు సిలువుపై పలికిన ఏడు మాటలను తన సందేశంద్వారా వినిపించారు. లోకంలో జీవించినంత కాలంలో మంచి పనులు చేయాలని, శత్రువులను ప్రేమించాలని, క్షమాగుణం కలిగి వుండాలన్నారు. ఏసుక్రీస్తు మానవాళి పాప ప్రక్షాళన కోసం తన ప్రాణాన్ని సైతం సిలువపై విడిచి ప్రేమ, శాంతితో అహింసను జయించవ్చనినిరూపించి సిలువపై రక్తం చిందించిన సందర్బంగా గుడ్‌ప్రైడేగా ఈ దినాన్నిశుభ శుక్రవారంగా పిలుస్తారని చాపిరేవుల ఆంతోని పుణ్యక్షేత్ర మతగురువుల కిషోర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో చర్చి సెక్రటరీ బైళ్ల ప్రభుదాసు, ట్రెజరర్ స్టీపెన్, కమిటి మెంబర్లు, మత గురువులు, సహాయ గురువులు, కన్యశ్రీలు,సంఘపెద్దలు, విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు.