Share News

లోక రక్షకుడు యేసుక్రీస్తు

ABN , Publish Date - Dec 26 , 2025 | 12:45 AM

లోకరక్షకుడు యేసుక్రిస్తు అని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు.

లోక రక్షకుడు యేసుక్రీస్తు
డోన: క్రైస్తవులతో కలిసి ప్రార్థనలు చేస్తున్న ఎమ్మెల్యే కోట్ల

ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

డోన టౌన/ రూరల్‌, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): లోకరక్షకుడు యేసుక్రిస్తు అని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా గురువారం పట్టణంలోని సీఎస్‌ఐ చర్చిలో ఎమ్మెల్యే కోట్ల పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎస్‌ఐ చర్చిలో పాస్టర్లు యేసుక్రీస్తు దివ్య సందేశాన్ని వినిపించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్వమానవాళికి యేసుక్రీస్తు పవిత్ర మార్గం చూపారని అన్నారు. పట్టణంలోని వైఎస్‌ నగర్‌లో వెలసిన బైబిల్‌ మిషన చర్చిలో పాస్టర్‌ బందెల రాజు ఆధ్వర్యం లో క్రిస్మస్‌ వేడుకలను జరుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కోట్లను క్రైస్తవులు శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్య దర్శి వలసల రామకృష్ణ, ఓబులాపురం శేషిరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన కోట్రికే హరికిషణ్‌, చండ్రపల్లి లక్ష్మీనారాయణ యాదవ్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు టీఈ రాఘ వేంద్రగౌడు, ఆలేబాదు పరమేష్‌, శ్రీరాములు, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌గౌడు, ఫాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.

చాగలమర్రి: యేసు మార్గం అనుసరణీయమని ఆర్సీఎం చర్చి ఫాదర్‌ మ్యాక్సిమ్‌ ఫెర్నాండ్‌ అన్నారు. గురువారం చాగలమర్రి ఆర్సీఎం చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. క్రీస్తూ పుట్టుక గురించి వివరించారు. ముత్యాలపాడు 133 ఏళ్ల చరిత్రగల ఎస్పీజీ చర్చిలో ఫాదర్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో గుడి ప్రదక్షిణ, ఆరాధన, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎ స్‌ఐ చర్చిలో నందం ఐజాక్‌, పెద్దబోదనం చర్చిలో రవీంద్రనాథ్‌బాబు, మార్తోమా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, గుడి ప్రదక్షిణలు చేశారు.

బనగానపల్లె: మండలంలోని పలు గ్రామాల్లో క్రిస్మస్‌ పండుగను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. చర్చీలను ప్రత్యేకంగా అలంకరించి, చర్చిల ఎదుట పశువుల పాక, క్రిస్మస్‌ ట్రీలను ఏర్పాటు చేశారు. బుధవా రం అర్ధరాత్రి నుంచే బనగానపల్లె పట్ణణంలోని సీఎస్‌ఐ చర్చి ఫాస్టర్‌ దైవాదీనం, ఆర్‌సీఎం చర్చి ఫాస్టర్‌ ప్రకాశల ఆధ్వర్యంలో క్రైస్తవులు ప్రార్థ నలు ప్రారంభించారు. బనగానపల్లె పట్టణంలోని సీఎస్‌ఐ చర్చిలో ఫాస్టర్‌ దైవాదీనం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనా గీతాలు ఆలపించారు. యేసు క్రీస్తు జననం, ఆయన మానవాళికి చేసిన సేవలను గురించి బోధిం చారు. ఆర్‌సీఎం చర్చిలో క్రైస్తవులు ఫాస్టర్‌ ప్రకాశ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చీల వద్ద ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. మంత్రి బీసీ జనార్దనరెడ్డి, టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ, మాజీ సర్పంచ బీసీ రాజారెడ్డి, బీసీ రామనాథరెడ్డిలు క్రైస్తవులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

రుద్రవరం: క్రిస్మస్‌ సందర్భంగా మండలంలోని చర్చీల్లో గురువారం క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహించారు. పెద్దకంబలూరు, రుద్రవరంలో, నర సాపురం, ఆలమూరు, చిత్తరేణిపల్లె, చందలూరు, మందలూరు, పేరూరు, కోటకొండ, చిన్నకంబలూరు గ్రామాల్లో పాస్టర్లు ప్రార్థనలు నిర్వహించారు.

కొలిమిగుండ్ల: మండలంలోని అబ్దులాపురం, బెలుం, కల్వటాల, కొలిమిగుండ్ల, బెలుం శింగవరం, తుమ్మలపెంట, నందిపాడు తదితర గ్రామాల్లోని చర్చీల్లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధ వారం అర్ధరాత్రి నుంచే వేడుకలను ప్రారంభించారు. ప్రత్యేకల అలంకర ణలు, పశువుల పాకలు ఏర్పాటుచేసి క్రీస్తు జననంపై స్తుతించారు. ఫాస్టర్లు క్రీస్తు జననంపై భక్తులకు వివరించారు.

అవుకు: క్రీస్తు చూపిన మార్గంలోనే క్రైస్తవులు నడవాలని ఆర్‌సీఎం చర్చి పాస్టర్‌ రవి అన్నారు. బుధవారం అర్థరాత్రి నుంచి ఆర్‌సీఎం, సీఎ స్‌ఐ చర్చీల్లో క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం క్రైస్తవులు చర్చీల వద్దకు చేరుకొని క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రార్థనలు చేశారు. ఫాస్టర్‌లు బైబిల్‌ను చదివి వినిపించారు. సాయంత్రం ఆటల పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజే శారు. కార్యక్రమంలో సెంట్‌మేరీస్‌ స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు దీప్తి, క్రైస్తవులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2025 | 12:45 AM