అప్రోచ్ రోడ్డును పరిశీలించిన జేసీ
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:42 AM
బేతంచెర్ల నగర పంచాయతీ బుగ్గానపల్లె గ్రామ పరిధిలో ఉన్న ఎంఐజీ లే అవుట్‌ను కర్నూలు జాయింట్ కలెక్టర్, కుడా వైస్ చైర్మన్ నూరుల్ కమర్ గురువారం పరిశీలించారు.
బేతంచెర్ల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): బేతంచెర్ల నగర పంచాయతీ బుగ్గానపల్లె గ్రామ పరిధిలో ఉన్న ఎంఐజీ లే అవుట్‌ను కర్నూలు జాయింట్ కలెక్టర్, కుడా వైస్ చైర్మన్ నూరుల్ కమర్ గురువారం పరిశీలించారు. ఎంఐజీ లేఅవుట్‌లో 20 అడుగుల అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేయడానికి లే అవుట్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారనే సమాచారం మేరకు జేసీ ఈ లేఅవుట్‌ను, దాని మ్యాప్‌ను కూడా ఆయన పరిశీలించారు. తమ అనుమతి లేకుండా 20 అడుగుల అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని లేఅవుట్ లైన్ నిర్వాహకులను ఆయన హెచ్చరించారు. ఆయన వెంట బేతంచెర్ల తహసీల్దార్ నాగమణి, నగర పంచాయతీ కమిషనర్ కమిషనర్ హరిప్రసాద్, వీఆర్వో రమేష్ చౌదరి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.