Share News

రైతులపై జగన్‌ది కపట ప్రేమ

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:10 AM

రైతులపై మాజీ సీఎం జగన్‌ కపట చూపుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.

రైతులపై జగన్‌ది కపట ప్రేమ

టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి

కర్నూలు అర్బన్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రైతులపై మాజీ సీఎం జగన్‌ కపట చూపుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 నుంచి 2024 జూన్‌ వరకు సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్‌ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని రైతులు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో వారికి తెలుసన్నారు. రాష్ట్రంలో తుఫాన్లు, వరదలు వచ్చిన సమయంలో కనీసం రైతుల గురించి ఆలోచించలేదని, బయటకు వస్తే పరదాల చాటున వచ్చిన నీకు చంద్రబాబు పాలనను తప్పు పట్టే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. ఉల్లి రైతులకు రూ. 1200 క్వింటా మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయడమేకాక హెక్టార్‌కు రూ. 50 వేలు సాయం ప్రకటించిందని గుర్తు చేశారు. పత్తి, మొక్కజొన్న, ఉద్యాన పంటలను మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు గురించి మాట్లాడటం, అరటిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి నిమిత్తం వారికి రావాణ సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు అధికారులను ప్రభుత్వం ఆదేశిందని చెప్పారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో లిక్కర్‌, కల్తీనెయ్యి, భూదందాలు, ఇసుక, మైనింగ్‌, వంటి మాఫియాల గురించి ఒక్కొక్కటి బయట పడుతుంటే దిక్కుతోచని జగన్‌ ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని మండిపడాడరు.

Updated Date - Nov 25 , 2025 | 12:10 AM