అల్లర్లు సృష్టించేందుకు జగన్ కుట్రలు
ABN , Publish Date - Jun 24 , 2025 | 11:09 PM
: రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని కుడా చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు.
కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు
కర్నూలు అర్బన్, జూన్ 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని కుడా చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. మంగళవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ, ప్రజల మద్దతుతో ముందుకు వెళ్తుంటే జగన్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. రెంటపాళ్ల పర్యటనలో సింగయ్యను కారుతో తొక్కించి.. రఫా..రఫా హత్య లను మొదలు పెట్టావా జగన్‌రెడ్డీ? అని ఆయన ప్రశ్నించారు. వైజాగ్‌లో యోగాంధ్ర కార్యక్రమాన్ని దేశప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ప్రజలు విరివిగా పాల్గొన్నారని, దాదాపు 3లక్షల మందికి పైగా పాల్గొంటే వైసీపీ నాయకులకు కనిపించచలేదా..? అట్టర్ ప్లాప్ అయ్యిందని తప్పుడు ప్రచారం చేశారని అన్నారు వైసీపీ నాయకులు కళ్లు ఉండి చూడలేని కబోదులయ్యారని ఎద్దేవా చేశారు. రాయలసీమ వాసిగా జగన్ ఈప్రాంత రైతులకు తలవంపులు తెచ్చేలా ఉన్నారని మండిపడ్డారు.