మద్యం స్కాంలో సూత్రధారి జగన్ రెడ్డే
ABN , Publish Date - Jul 27 , 2025 | 11:41 PM
మద్యం స్కాంలో సూత్రధారి జగన్ రెడ్డే అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుడా చైర్మన్ సోమి శెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు.
కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు
కర్నూలు అర్బన్, జూలై 27(ఆంధ్రజ్యోతి): మద్యం స్కాంలో సూత్రధారి జగన్ రెడ్డే అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుడా చైర్మన్ సోమి శెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆదివారం తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సోమిశెట్టి మాట్లాడుతూ తన పేరు మిఽఽథున్‌రెడ్డి ఎక్కడ బయట పెడుతాడోనంటూ జైలు జగన్‌రెడ్డి పరుగులు తీశారని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో జరిగిన స్కామ్‌లు వెలుగులోకి వస్తున్నాయన్నారు. దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో వచ్చేది తమ ప్రభుత్వమేనని తమని ఇబ్బంది పెట్టిన వారిని అప్పుడు ఎవరిని వదలి పెట్టమని విచారణ అఽధికారులను జగన్ భయపెడుతున్నారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ప్రజలకు సుపరిపాలన అందుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుంటే వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. వ్యవస్థలన్నింటిని గాడిలో పెట్టేందుకు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.