Share News

హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన జగన్‌

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:16 AM

వెన్నుపోటు రాజకీయాలు చేసి హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన చరిత్ర జగన్‌దే అని టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌ ఆరోపిం చారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు

హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన జగన్‌
మాట్లాడుతున్న ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌

ఆలూరు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): వెన్నుపోటు రాజకీయాలు చేసి హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన చరిత్ర జగన్‌దే అని టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌ ఆరోపిం చారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శివకుమార్‌ స్థాపించిన వైసీపీని కబ్జా చేశారన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించారని, కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ధర్నాల పేరిట డ్రామాకు తెరలేపారన్నారు. ఆస్తి కోసం చెల్లిని కూడా కాదన్న చరిత్ర ఎవరిదో రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. గత ప్రభుత్వంలో డీఎస్సీ హామీపై మాట తప్పి యువతను వెన్నుపోటు పొడిచారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70 శాతం హామీలు అమలు చేశారన్నారు. అమ్మకు వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం రెండు నెలల్లో అమలు చేస్తామన్నారు. దీపం కింద ఉచిత సిలిండర్లు, పింఛన్లపెంపు, అన్న క్యాంటీన్లను అమలు చేశామన్నారు. సర్పంచ్‌ నాగరాజు, నాయకులు నరసప్ప, రామాంజనేయులు, విశ్వేశ్వరస్వామి, బసప్ప, ముద్దురంగ, గూళ్యం రామాంజనేయులు, ఆంజనేయ, మల్లేష్‌, కిట్టు, రాముయాదవ్‌, హనుమప్ప పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 12:16 AM