Share News

ప్రజలకు వెన్నుపోటు పొడిచిన జగన్‌రెడ్డి

ABN , Publish Date - Jun 05 , 2025 | 12:02 AM

రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత మాజీ సీఎం జగన్‌రెడ్డిదేనని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని చెన్నమ్మకూడలిలో కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్న వైసీ పీ తీరును ఖండిస్తూ నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌తో కలిసి నిరసన వ్యక్తంచేశారు.

ప్రజలకు వెన్నుపోటు పొడిచిన జగన్‌రెడ్డి
చెన్నమ్మకూడలిలో మాట్లాడుతున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి

తల్లికి, చెల్లికి వెన్నుపోటు, బాబాయికి గొడ్డలిపోటు

కూటమి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు

వైసీపీని ప్రజలు నమ్మే స్థితిలో లేరు.. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

చెన్నమ్మకూడలిలో వినూత్నంగా నిరసన

కల్లూరు, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత మాజీ సీఎం జగన్‌రెడ్డిదేనని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని చెన్నమ్మకూడలిలో కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్న వైసీ పీ తీరును ఖండిస్తూ నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌తో కలిసి నిరసన వ్యక్తంచేశారు.

ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ ఆస్తి కోసం తల్లికి, చెల్లికి వెన్ను పోటు, సొంత బాబాయికి గొడ్డలి పోటు ఘ నత కూడా జగన్‌రెడ్డిదేనని ఎద్దేవా చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాం లో విధ్వంస, అరాచక పాలనను తిరష్కరించి రాష్ట్రంలో కూటమికి తిరుగులేని మెజా రిటీని అందించారన్నారు. జగన్‌రెడ్డి కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైసీపీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని గౌరు స్పష్టం చేశారు. వైసీపీ తీరుకు నిరసనగా నగరంలోని చెన్నమ్మకూడలిలో టీడీపీ శేణులు ఎంిపీ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్‌. వివేకానందరెడ్డి చిత్రపటాలతో వినూత్నంగా నిరసన చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు గౌరు జనార్ధన్‌ రెడ్డి, కర్నూలు మార్కెట్‌యార్డ్‌ మాజీ చైర్మన్‌ పెరుగు పురుషోత్తంరెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌యాదవ్‌, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, ఎన్వీ.రామకృష్ణ, పియూ.మాదన్న టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:02 AM