ఇది రైతు ప్రభుత్వం : ఎమ్మెల్యే బీవీ
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:38 PM
రాష్ట్రంలో రైతు ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయం వద్ద నందవరం మండలం మాచాపురం గ్రామానికి చెందిన ఇరువురు రైతులకు సబ్సిడీపై మంజూరైన డ్రోన్లను పంపిణీ చేశారు
ఎమ్మిగనూరు, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతు ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయం వద్ద నందవరం మండలం మాచాపురం గ్రామానికి చెందిన ఇరువురు రైతులకు సబ్సిడీపై మంజూరైన డ్రోన్లను పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకీకరణను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు 80శాతం రాయితీతో రూ.10లక్షల విలువచేసే డ్రోన్లను అందిస్తున్నారని ఇది రైతులకు ఉపయోగపడుతుందన్నారు. ఉల్లి, పత్తి పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. 13 మంది బాదితులకు రూ.6.57లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నందవరం మండలం కనకవీడు టీడీపీ కార్యకర్త చిన్న నరసింహుడు కుటుంబానికి ప్రమాద బీమా పరిహారం రూ.5లక్షలు ఖాతాలో జమ అయిందన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లయ్య, బాస్కర్ల చంద్రశేఖర్, ఖాసి వలి, కమ్మ మహేంద్రబాబు, గోపాల్, మాజీ ఎంపీపీ శంకరయ్య పాల్గొన్నారు.