Share News

టెండర్లు పిలవడం విడ్డూరం

ABN , Publish Date - Jul 01 , 2025 | 01:03 AM

హైకోర్టు కేసు కొట్టివే యడంతో భూములు సాగు చేసుకునేందుకు ఇవ్వకుండా వక్ఫ్‌బోర్డు అధి కారులు తిరిగి టెండర్లకు పిలవడం విడ్డూరంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

టెండర్లు పిలవడం విడ్డూరం
జాయింట్‌ కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తున్న హాలహర్వి రైతులు

జాయింట్‌ కలెక్టర్‌కు రైతుల వినతి

కర్నూలు కలెక్టరేట్‌, జూన 30(ఆంధ్రజ్యోతి): హైకోర్టు కేసు కొట్టివే యడంతో భూములు సాగు చేసుకునేందుకు ఇవ్వకుండా వక్ఫ్‌బోర్డు అధి కారులు తిరిగి టెండర్లకు పిలవడం విడ్డూరంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్‌బోర్డు అధికారుల తీరును నిరసిస్తూ నంద వరం మండలం హాలహర్వి గ్రామ రైతులు యాపిలయ్య, గుంటెప్ప, కౌలుట్ల స్వామి, నాగరాజు, అసురఖాన ముతావల్లి ముల్లా ఖాశీం సాహేబ్‌, మహబూబ్‌ బాషా, నజీర్‌ అహ్మద్‌, అల్లాబకాష్‌ సోమవారం జేసీ నవ్యకు కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ హాలహర్వి గ్రామంలో సర్వే.నెంబర్‌: 254, 534, 887లో 85.83 ఎకరాల అసురఖానకు చెందిన వక్ఫ్‌ భూమి ఉందన్నారు. ఈభూములకు 2021 జూన 30న టెండర్లు పిలవగా గ్రామానికి చెందిన తాము రూ.5,71,000 గుత్త చెల్లిం చే విధంగా వేలంపాట పాడి దక్కించుకున్నట్లు తెలిపారు. డబ్బులు కూడా డిపాజిట్‌ చేశామన్నారు. 2021 జూన30న గ్రామానికి చెందిన కొంత మంది హైకోర్టును ఆశ్రయిం చడంతో అధికారులు భూ ములను రైతులకు సాగుకు ఇవ్వకుండా ఆపేశారన్నారు. దీనిపై వక్ఫ్‌ బోర్డు అధికారులు సవాల్‌చేసి 2023లో కోర్టులో విజయం సాధించినట్లు తెలిపారు. అప్పటి నుంచి తాము భూములు సాగుకు ఇవ్వాలని పలు మార్లు వక్ఫ్‌బోర్డు అధికారులను కలిసి విన్నవించినా వారినుంచి ఎలాంటి చలనం లేదన్నారు. తమకు వక్ఫ్‌ భూములను సాగుకు ఇవ్వక పోగా, తాము చెల్లించిన డబ్బులను తిరిగి చెల్లించకుండా కొత్తగా 2025 జూలై 2న వేలం పాటలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులను మోసం చేస్తూ అధికా రులను తప్పుదోవ పట్టిస్తూ వేలం పాటలు నిర్వహించేందుకు సిద్దమైన వక్ఫ్‌ బోర్డు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Jul 01 , 2025 | 01:03 AM