పరిసరాలు శుభ్రంగా ఉంచడం మన బాధ్యత
ABN , Publish Date - Sep 21 , 2025 | 12:18 AM
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్ర కాశ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి
డోన టౌన, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్ర కాశ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద గ్రీన ఏపీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్వచ్ఛాంధ్ర- స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల పాల్గొని మాట్లాడారు. పత్రి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్ర మంలో ఆర్డీవో నరసింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌గౌడు, సీఐ ఇంతియాజ్ బాషా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్రికే ఫణిరాజ్, ఓబులాపురం శేషిరెడ్డి, మాజీ ఎంపీపీ శేషఫణిగౌడు, కోట్రికే హరికిషన, రేగటి అర్జున రెడ్డి, టీఈ రాఘవేంద్రగౌడు, చంద్రపల్లి లక్ష్మీనారాయణ, టీడీపీ మండల అధ్యక్షులు వెంకటనాయునిపల్లె శ్రీనివాసులు యాదవ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.