కులాల మధ్య చిచ్చుపెట్టడం మంచిది కాదు
ABN , Publish Date - May 08 , 2025 | 12:18 AM
రాయలసీమ యూని వర్సిటీ క్యాంపస్‌లో కులాల మధ్య చిచ్చు పెట్టడం మంచి సంప్రదా యం కాదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు అన్నారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు
కర్నూలు అర్బన, మే 7(ఆంధ్రజ్యోతి): రాయలసీమ యూని వర్సిటీ క్యాంపస్‌లో కులాల మధ్య చిచ్చు పెట్టడం మంచి సంప్రదా యం కాదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు అన్నారు. బుధవా రం ఆర్‌యూ ఉపకులపతిని ఆయన చాంబర్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, జాతీయ బీసీ సంక్షేమం సంఘం అధ్యక్షుడు, డీసీఎంహెచ చైర్మన నాగేశ్వరరావు కలిశారు. ప్రొఫెసర్ ఎస్‌టీకే ఆగడాలకు అడ్డుకట్ట వే స్తారా.. లేక మంత్రి నారా లోకేశ వద్ద తెల్చుకోమంటారా అంటూ ఆయన ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం మంచి సంప్రదా యం కాదని, బీసీ ఉద్యోగిపైౖ క్యాంపస్‌లో దాడి జరిగితే చర్యలు తీసుకోకుండా ఉన్నారంటూ ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ హక్కుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నంరాజేశ్వరీ, బీసీ సంక్షేమం సంఘం రాష్ట్ర నాయకులు నక్కల మిట్ట శ్రీనివాసులు, టీడీపీ బీసీ రజక సంఘం రాష్ట్ర నాయకులు వెంపేంట రాంబాబు, నంది విజయలక్ష్మి, ఆర్‌వీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సీమకృష్ణ, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు వీవీ రమణ పాల్గొన్నారు.