Share News

సాగు భూములు లాక్కోవడం తగదు

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:12 AM

పవర్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు కోసం సారవంతమైన సాగు భూములను లాక్కోవడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు

సాగు భూములు లాక్కోవడం తగదు
మణేకుర్తి గ్రామంలో రామకృష్ణతో మాట్లాడుతున్న రైతులు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

ఆలూరు రూరల్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పవర్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు కోసం సారవంతమైన సాగు భూములను లాక్కోవడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. సోమవారం సాయంత్రం మణేకుర్తి గ్రామంలో పొలాలను పరిశీలించారు. భూముల మీదే ఆధారపడి జీవిస్తున్న తమకు న్యాయం చేయాలని రైతులు విన్నవంచారు. రామకృష్ణ మాట్లాడుతూ ఈ విషయపౖ ట్రాన్స్‌ సీఎండీ విజయానంద్‌ దృష్ఠికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తామన్నారు. గిడ్డయ్య, గౌస్‌దే శాయి, రామచంద్రయ్య, నాయకులు నారాయణస్వామి, హనుమంతు ఉన్నారు.

సురవరం ఆశయ సాధనకు కృషి

ఆలూరు: దివంగత సీపీఐ నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. సోమవారం రాత్రి మొలగవల్లిలో రామాంజనేయులు అధ్యక్షతన సంస్మరణ సభ నిర్వహించారు. ఆవుల శేఖర్‌, సర్పంచ్‌ మోహన్‌రాజ్‌ ఉన్నారు.

వందేళ్లుగా పోరాడుతున్న సీపీఐ

క్రిష్ణగిరి: సీపీఐ వందేళ్లుగా ప్రజల తరుపున పోరాడు తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని కటారుకొండ గ్రామంలోని చెరువు వద్ద నాయకులతో కలిసి 100 మెక్కలను నాటారు. గిడ్డయ్య, రంగనాయుడు, రామంజనేయులు, కటారుకొండ, బోయ బొంతిరాళ్ళ సర్పంచ్‌లు నక్కీ లెనిన్‌బాబు ఉన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 12:12 AM