Share News

కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వాలి

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:20 AM

: మూడు నెలలకు ఒకసారి అక్రిడిటేషన్ల గడువు పొడిగిస్తున్నారని, అలా కాకుండా కొత్త అక్రిడిటేషన్లను వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ యూని యన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (ఏపీయూడబ్ల్యూజే) నాయకులు డిమాం డ్‌ చేశారు.

కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వాలి
కర్నూలు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న జర్నలిస్టులు

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం

అర్హులైనవారికి ఇళ్ల స్థలాలుకేటాయించాలి

ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ధర్నా

డీఆర్వోకు వినతిపత్రం

కర్నూలు కల్చరల్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): మూడు నెలలకు ఒకసారి అక్రిడిటేషన్ల గడువు పొడిగిస్తున్నారని, అలా కాకుండా కొత్త అక్రిడిటేషన్లను వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ యూని యన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (ఏపీయూడబ్ల్యూజే) నాయకులు డిమాం డ్‌ చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిం చారు. గత ప్రభుత్వం అక్రిడిటేషన్‌ మంజూరులో అసంబద్ధమైన నిర్ణయాలు, నిబంధనలు విధించడంతో 23వేల నుంచి 9 వేలకు అక్రిడి టేషన్లు కుదించారన్నారు. తాము అధికారంలోకి వస్తే అర్హులైన వారంద రికీ అక్రిడిటేషన్లు ఇస్తామని కూటమి పార్టీల నేతలు చెప్పారని, ఏడాదిన్నర దాటినా ఇంతవరకు కొత్త అక్రిడిటేషన్ల ప్రక్రియ ప్రారంభించ లేదన్నారు. దీంతో చాలా మంది జర్నలిస్టులు హెల్త్‌కార్డు అవకాశం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. తమిళనాడు, బిహార్‌ రాష్ర్టాల తరహాలో సీనియర్‌ జర్నలిస్టులకు పింఛన్‌ సౌకర్యం కల్పించాలని కోరా రు. ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లలో జర్నలిస్టుల పిల్లలకు 50శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని అన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందిం చి సమస్య లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రత్యక్ష ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్రఉపాధ్యక్షుడు గోరంట్ల కొండప్ప, జిల్లా గౌరవాధ్యక్షుడు ఎన్‌.వి. సుబ్బయ్య, గౌరవ సలహాదారు వై.వి.కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఈ.ఎన్‌.రాజు, కె. శ్రీనివాస గౌడ్‌, కోశాధికారి అంజి, నాయకులు దస్తగిరి, శివరాజ్‌కుమార్‌, అవినాష్‌, రామయ్య పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 12:23 AM